జనతా గ్యారేజ్ ట్రైలర్ రెడీ..!!

  • August 10, 2016 / 07:34 AM IST

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ సినిమా ట్రైలర్ సిద్దమయింది. ఇందుకోసం తారక్ డబ్బింగ్ ను పూర్తి చేశారు. గత నెల విడుదలైన టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఒక డైలాగ్ చెప్పారు. అయినా ఆ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ట్రైలర్ లో అనేక పవర్ ఫుల్ డైలాగులు ఉండనున్నట్లు సమాచారం. మూవీ పై మరింత క్రేజ్ పెరిగేలా ఈ వీడియోను ఎడిట్ చేసినట్లు తెలిసింది.

ప్రస్తుతం శివ దగ్గరుండి తుది మెరుగులు దిద్దుతున్నారని చిత్ర బృందం వెల్లడించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన హుషారైన పాటలను ఈ నెల 12 న శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారు. ఈ వేడుకలో భాగంగా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. జనతా గ్యారేజ్ లో సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించారు. కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాటలో అదరగొట్టనుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్  కీలక రోల్ పోషిస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.  మైత్రి మూవీ మేకర్స్ వారు 50 కోట్లతో నిర్మిస్తున్న ఈ మూవీ విడుదలకు ముందే మంచి బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాల టాక్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus