యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ మ్యానియాను తన నటనతో, డ్యాన్స్ తో, పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే హీరోల్లో ఎన్టీఆర్ ఎప్పుడు టాప్ ప్లేస్ లో ఉంటాడు. అయితే అలాంటి ఎన్టీఆర్ కు దాదాపుగా 50కోట్ల క్లబ్ లో చేరడానికి 25సినిమాల టైమ్ పట్టింది. ఇదిలా ఉంటే హిట్స్ తో,ఫ్లాప్స్ తో సంభంధం లేకుండా ఎన్టీఆర్ కరియర్ దూసుకుపోతున్న క్రమంలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా ఎన్టీఆర్ కరియర్ లో ఒక మైలు రాయిగా మిగిలిపోయింది. అదేక్రమంలో తొలి 50కోట్లు వసూళ్లు చేసిన సినిమాగా ఎన్టీఆర్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఇక మరో పక్క ఎన్టీఆర్ ఇప్పుడు భారీ ఆలోచనలు చేస్తున్నాడు.
శ్రీమంతుడు సినిమాతో ప్రిన్స్ మహేష్ 100కోట్ల క్లబ్ లో చేరాడు, ఇక సరైనోడు సినిమాతో బన్నీ సైతం అదే బాటలో పయనిస్తున్నాడు. వీళ్ళిద్దరినీ టార్గెట్ చేసి, చెక్ పెట్టేందుకు ఎన్టీఆర్ విశ్వప్రయత్నాలే చేస్తున్నాడు…అందులో భాగంగానే ఓవెర్సీస్ లో మంచి మార్కెట్ ఉన్న ప్రిన్స్ కు ధీటుగా అక్కడ ఫేమస్ అవ్వాలి అన్న ఆలోచనతో, జనతా గ్యారేజ్ ఆడియోని అక్కడ కూడా విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక అదే క్రమంలో తమిళ, మళయాళం లో మంచి మార్కెట్ ఉన్న బన్నీకి సైతం చెక్ పెట్టె దిశగా, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ఇమేజ్ తో కేరళ లోను పాగా వెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగి సినిమా భారీ హిట్ అయితే ఎంటీర్ అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్లే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.