Jr NTR: కొడుకు కోసం ఆ పని చేసిన యంగ్ టైగర్..!

  • April 19, 2021 / 12:58 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కూడా తగినంత సమయం కేటాయిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కొడుకు కోరికను తీర్చడం కోసం రిస్క్ చేశారు. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నా తగిన జాగ్రత్తలు తీసుకుని రెండో కొడుకు భార్గవ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ హైదరాబాద్ రోడ్లపై బైక్ మీద చక్కర్లు కొట్టారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ కొడుకుతో బైక్ రైడ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకవైపు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే పిల్లల చిన్నచిన్న కోరికలను తీరుస్తూ ఎన్టీఆర్ వార్తల్లో నిలుస్తున్నారు. అడిగిన కోరికను ఎన్టీఆర్ తీర్చడంతో భార్గవ్ రామ్ సంతోషపడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నటించబోతున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ అమాయక చక్రవర్తిలా కనిపిస్తారని సమాచారం. కొరటాల శివ మూవీ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. మే నెల 20వ తేదీన ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా తెరకెక్కనుంది. ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus