అదిరిన ఎన్టీఆర్ న్యూ లుక్.!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాలని ఎన్టీఆర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది ఇన్ని రోజులకి కుదిరింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని, రికార్డులు సృష్టించాలని తారక్ భావిస్తున్నారు. అందుకోసమే సినిమాకి కొబ్బరి కాయ కొట్టినప్పటి నుంచి ప్రతి రోజూ మూడు గంటలు జిమ్ లో కష్టపడుతున్నారు. బాడీని పూర్తిగా మార్చివేస్తున్నారు. టెంపర్ లుక్ కంటే మరింత ఆకర్షణీయంగా తయారవుతున్నారు. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి. కానీ పూర్తి లుక్ బయటికి రాలేదు. ఈరోజు ఎన్టీఆర్ లుక్ బయటికి వచ్చింది. ఎన్టీఆర్ ఐపీఎల్ కి ఈసారి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

దానికి సంబంధించిన యాడ్ షూటింగ్ నిన్న జరిగింది. ఆ సెట్ లోని రెండు స్టిల్స్ నేడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ ఫోటోలలో ఎన్టీఆర్ ని చూసిన అభిమానులు సంబరపడుతున్నారు. ఎంతో యంగ్ గా, స్లిమ్ గా కనబడుతున్నారని తారక్ పై అభినందనలు కురిపిస్తున్నారు. లుక్ తోనే ఎన్టీఆర్ అందరినీ ప్లాట్ చేశారని… ఇక త్రివిక్రమ్ వెండితెరపై మరింత అందంగా చూపిస్తాడని ఆనందపడుతున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus