ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో యమ బిజీగా ఉన్న ఎన్టీఆర్ తమ మామ నార్నే శ్రీనివాసరావు ఇల్లు, ఆఫీసులపై జరిగిన ఐటీ రైడ్స్ విషయంలో విస్మయానికి గురయ్యాడు. మొన్నటివరకూ టిడిపి ముఖ్యమైన మనిషిగా ఉన్న నార్నే శ్రీనివాసరావు.. సరిగ్గా ఎన్నికల ముందు మాత్రం వై.ఎస్.ఆర్.సి.పి పార్టీలోకి మారాడు. అక్కడ ఎమ్మెల్యే టికెట్ కోసం విఫల యత్నంలో నవ్వులపాలయ్యాడు అది వేరే విషయం అనుకోండి. అయితే.. ఇప్పటికీ పార్టీ మెంబర్ గానే ఉన్నాడు. కానీ.. ఉన్నట్లుండి నిన్న ఐటీ శాఖ నార్నేకు సంబంధించిన రియల్ ఎస్టేట్ ఆఫీసులు, స్టూడియో ఎన్ ఆఫీస్ మరియు ఇతర కార్యాలయాలు, ఇళ్లపై దాడి చేశాయి. ఐటీ సోదాల అనంతరం ఏమైనా జరిగిందా అనేది ఇంకా తెలియకపోయినప్పటికీ.. ఇలా సడన్ గా జరిగిన ఐటీ రైడ్స్ కి మాత్రం ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యిందట.
ఇకపోతే.. ఆర్.ఆర్.ఆర్ లో తన కీలకమైన పోరాట సన్నివేశాలు, ఎంట్రీ సీన్ షూటింగ్ పూర్తిచేసిన ఎన్టీఆర్ కొన్నాళ్లు విరామం తీసుకొనున్నాడు. హీరోయిన్ ఫైనల్ అయ్యాక ఆమె కాంబినేషన్ సీన్స్ & క్లైమాక్స్ ను ఈ గ్యాప్ తర్వాత షూట్ చేస్తాడు ఎన్టీఆర్. ఈలోపు రామ్ చరణ్ తన పార్ట్ ను ఫినిష్ చేస్తాడు.
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?