Jr NTR: ఎన్టీఆర్ కు చుక్కలు చూపించిన కొడుకు.. సేమ్ టు సేమ్ అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండగా వరుస ప్రాజెక్ట్ లు మాస్ హీరోగా తారక్ రేంజ్ ను పెంచుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు పేరు అభయ్ రామ్ కాగా చిన్న కొడుకు పేరు భార్గవ్ రామ్ అనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు సైలెంట్ అని భార్గవ్ రామ్ మాత్రం అల్లరి బాగా చేస్తాడని సినిమా ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే అభయ్ రామ్ తక్కువేం కాదని కొంటె పనులు బాగానే చేస్తాడని తెలుస్తోంది.

ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తాను నిద్రలో ఉన్న సమయంలో ఎవరో వచ్చి ఫడేల్ మని కొట్టి పోయేవారని ఎవరా అని ఆరా తీస్తే అభయ్ రామ్ అని తెలిసిందని తారక్ తెలిపారు. ఈ విధంగా పెద్ద కొడుకు తనకు చుక్కలు చూపించాడని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. అభయ్ నాలా సౌమ్యుడని అందుకే ఇలాంటి కొంటె పనులు చేస్తాడని మేమిద్దరం సేమ్ టు సేమ్ అని తారక్ పేర్కొన్నారు.

భార్గవ్ రామ్ మాత్రం ప్రణతిలా హైపర్ అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలు సాధిస్తుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

తారక్ క్రేజ్ పరంగా ఇతర భాషల్లో సైతం అంతకంతకూ క్రేజ్ ను పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 80 నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. తారక్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus