ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి శుభవార్త

  • October 5, 2018 / 01:17 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన ఈ మూవీ అరవింద సమేత వీరాఘవలో అనేక ప్రత్యేకతలున్నాయి. తొలిసారి తారక్ రాయలసీమ యాసలో మాట్లాడుతుండడం… ఎన్టీఆర్ కి మెగా హీరో నాగబాబు తండ్రిగా నటించడం.. భారీ యాక్షన్ సీన్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కొన్ని విషయాలు ట్రైలర్ వల్ల తెలిస్తే… లీకుల వల్ల మరికొన్ని బయటపడ్డాయి. ఇలా సినిమాలోని ముఖ్య అంశాలు బయటికి చెప్పేస్తే థ్రిల్ ఏముంటుందని కొన్ని అంశాలను దాచివుంచినట్లు తెలిసింది. అటువంటి సీక్రెట్స్ లో ఒకటి ఈరోజు బయటపడింది. అది ఏమిటంటే ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ నటించిన సంగతి.

ఇందులో ఎన్టీఆర్ చిన్నప్పటి క్యారెక్టర్‌ పోషించినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు ఇంతకన్నా సంతోషం కలిగించే వార్త మరొకటి ఉండదు. సెట్స్ లో కత్తి పట్టుకున్న అభయ్ రామ్ ఫోటోలు కొన్ని రోజులుగా వైరల్ అయ్యాయి. వెండితెరపైనే కలిపిస్తే చప్పట్లు మారుమోగిపోతాయి. ఎన్టీఆర్ చిన్నప్పుడే రాముడిగా నటించి అందరి మెప్పు అందుకున్నారు. అదే విధంగా అభయ్ రామ్ కూడా అభినందనలు అందుకోవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus