టాలీవుడ్ యంగ్ టైగర్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చెయ్యబోతున్నాడా? సెప్టెంబర్ లో సునామీ సృష్టించబోతున్నాడా?? టాలీవుడ్ రికార్డులను తిరగ రాసేందుకు పంజా విసురుతూన్నాడా? అంటే అవును అనే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అవును సెప్టెంబర్ రెండున రాబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. అదే క్రమంలో…ఒక సునామీ లా దూసుకు వస్తున్న ఈ సినిమా మ్యానియాకు భయపడి ఆ వారం చెప్పుకోతగ్గ సినిమాలు ఏమీ విడుదల కావడం లేదు.
అయితే సెప్టెంబర్ 9న రెండు సినిమాలు అందులో ఒకటి నాగచైతన్య ‘ప్రేమమ్’ కాగా…రెండు సునీల్ ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమాలు విడుదల కావాల్సి ఉండగా…ఎందుకొచ్చిన రిస్క్, ఈ సునామీలో కొట్టుకుపోవడం ఖాయం అని సైడ్ అయిపోయారు నిర్మాతలు…అదే క్రమంలో ప్రస్తుతం ఈ సినిమాకు ఎటువంటి పోటీ లేకపోవడంతో, బడా హీరోల సినిమాలు ఏవీ లేకపోవడంతో, ఈ సినిమాను మన తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ధియేటర్లలో విడుదల చేయబోతున్నారు. వినాయకచవితి పండుగ సెలవలతో పాటు లాంగ్ వీకెండ్ కలిసి రావడం ‘జనతా గ్యారేజ్’ కి అదృష్టంగా మారింది. అయితే అదే క్రమంలో భారీ అంచనాలు పెరిగిన దృష్ట్యా…ఈ సినిమాపై కాస్త టెన్షన్ వాతావరణము కనిపిస్తుంది. ఎందుకంటే…భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం యొక్క హైప్ చూసి భారీ దరకు కొన్నారు బయ్యర్స్.
ఇక ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు లాభ పడాలి అంటే 65 కోట్ల నెట్ కలక్షన్స్ రావాలి. ఈ స్థాయిలో ‘జనతా గ్యారేజ్’ విజయం సాధించాలి అంటే ఈసినిమాకు మొదటి రోజు మొదటి షో నుండి ఎటువంటి డివైడ్ టాక్ లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి సూపర్ హిట్ టాక్ రావాలి. చూద్దాం ఏం జరుగుతుందో.