మూడోసారి ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్

  • June 13, 2016 / 02:38 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడోసారి ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. మా టీవీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది నిర్వహించే అవార్డ్ వేడుకలలో ఎన్టీఆర్ ఈ రికార్డ్ క్రియేట్ చేసారు. ఇది వరకు సింహాద్రి, యమదొంగ సినిమాలకు అవార్డ్ అందుకోగా ఈసారి టెంపర్ సినిమాలో నటనకు గాను ఈ గౌరవం పొందారు. ఆదివారం జరిగిన మా టీవీ అవార్డ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఎన్టీఆర్ ఈ అవార్డ్ అందుకున్నారు. దీంతో అభిమానులందరూ పండగ చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ “నాకు ఈ అవార్డు ఇచ్చిన స్టార్ ఇండియా వారికి నా ధన్యవాదాలు. చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ గారి ఆశీర్వచనాలు మా ఈ జనరేషన్ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను’’ అంటూ ముగించాడు. ఎన్టీఆర్ తో పాటు టెంపర్ చిత్రానికి మరో రెండు అవార్డులు వరించాయి. మాటల రచయితగా పూరి జగన్నాధ్ కు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా పోసాని కృష్ణ మురళికి అవార్డులు దక్కాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus