వైరల్ గా మారిన ఎన్టీఆర్, అభయ్ ల కొత్త పిక్..!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రాంచరణ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. హీరోలిద్దరికీ గాయాలవ్వడంతో షూటింగ్ కు కొన్నాళ్లుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా ఓ పిక్ ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తుంది. తన పెద్ద కొడుకు అభయ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ నైట్ వాక్ చేస్తున్న ఓ ఫొటో ఒకటి బయటకు వచ్చింది.

ఈ ఫోటో ఇలా బయటకి వచ్చిందో లేదో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అభయ్ ఏదో అగిగేతే స్వయంగా కొనివ్వడానికి తీసుకెళుతున్నట్లున్న ఈ ఫోటో చూస్తే అర్ధం అవుతుంది. ‘ఈ ఫొటోలో యంగ్ టైగర్ పక్కన నడుస్తున్న బుల్లి టైగర్ లా ఉన్నాడు అభయ్’ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ ఫొటోలో ఎన్టీఆర్ చేతికి కట్టు కూడా లేదు. దీంతో అయన గాయం పూర్తిగా తగ్గిందనే ఆనందంతో కూడా వారున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus