ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ నెక్స్ట్… కన్ఫార్మ్?

  • July 9, 2019 / 03:14 PM IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ”హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘గీతా ఆర్ట్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్దే, నివేదా పేతురాజు హీరోయిన్లుగా నటిస్తుండగా సుశాంత్, నవదీప్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేస్తాడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

తాజా సమాచారం ప్రకారం… మరోసారి జూ.ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అందుకు సంబందించిన మాటలు కూడా జరిగిపోయాయట. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. 2020 మార్చి నెలకి కాళీ అయ్యే అవకాశం ఉందట. ఆ సమయానికే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా ప్రారంభించే అవకాశం ఉందని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. అయితే త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి కూడా అనౌన్స్ చేసేసారు. కొరటాల సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్లో చిరంజీవి సినిమా ఉంటుందని… ఆ చిత్రాన్ని డీవీవీ. దానయ్య నిర్మిస్తారని… చరణ్ కూడా ‘వినయ విధేయ రామా’ చిత్రం ప్రమోషన్ల సమయంలో చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా ఓకే చేసుకున్నాడు అంటే మెగాస్టార్ కు హ్యాండిచ్చేసినట్టేనా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus