జూలై లో సందడి చేయనున్న యువహీరోల చిత్రాలు

  • June 27, 2017 / 02:29 PM IST

తెలుగు చిత్రపరిశ్రమకు 2017 బాగానే కలిసి వచ్చింది. సంక్రాంతి సీజన్ కి వచ్చిన ఖైదీ నంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి, శతమానం భవతి మూడు సినిమాలు విజయం సాధించి మంచి ఉత్సాహం ఇచ్చాయి. వేసవి సెలవులకు వచ్చిన బాహుబలి కంక్లూజన్ అన్ని రికార్డులను బద్దలు కొట్టి భారీ బడ్జెట్ సినిమాలకు స్ఫూర్తిని ఇచ్చింది. ఇలా కలెక్షన్లు, రికార్డులతో ప్రథమార్ధం సంతోషంగానే రెండు రోజుల్లో ముగియనుంది. అలాగే ద్వితీయార్ధం కూడా జోష్ తోనే మొదలుకాబోతోంది. ఈ ఇయర్ ఫస్టాఫ్ లో ‘నేను లోకల్‌’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని సెకండాఫ్ లో ‘నిన్నుకోరి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ చిత్రం జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. జులైలో రాబోతున్న మరో క్రేజీ మూవీ శమంతకమణి. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది హీరోలుగా రూపొందిన మల్టీ స్టారర్ చిత్రమిది. ఈ చిత్రం జులై14న థియేటర్లోకి రానుంది.

వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’ మూవీ  జులై మూడో వారంలో విడుదలకు ముస్తాబవుతోంది . చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ లో సాయి పల్లవి  హీరోయిన్ గా నటించడం స్పెషల్. ట్రైలర్‌తో ఆకట్టుకుంటున్న ‘ఫిదా’ జులై 21న ఆడియన్స్ ముందుకు రానుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్, సాయి థరమ్ తేజ్ కథానాయకులుగా రూపొందిన  ‘నక్షత్రం’ కూడా జులైలోనే విడుదల కానుంది. ఇంకా సుకుమార్ నిర్మాణంలో రూపొందిన ‘దర్శకుడు’, ధనుష్ కథా నాయకుడిగా వస్తున్న ‘వీఐపీ-2’ చిత్రాలు కూడా జులై‌లోనే రిలీజ్ కానున్నాయి. వీటిలో ఏ చిత్రాన్ని హిట్ చేస్తారో ప్రేక్షక దేవుళ్లే చెప్పాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus