బాహుబలి కంక్లూజన్ లోని విషయాలు చెప్పిన బాల బాహుబలి

  • April 8, 2017 / 12:17 PM IST

బాహుబలి బిగినింగ్ లో చిన్నప్పటి అమరేంద్ర బాహుబలి గా నటించిన అబ్బాయ్ గుర్తున్నాడా..?, కట్టప్పను మామ అని పిలిచే ఆ పిల్లోడు  పేరు నిఖిలేశ్వర్. అమలాపురం దగ్గర నేదునూరులో పుట్టినప్పటికీ ఇప్పుడు హైదరాబాద్ లోనే చదువుకుంటున్నాడు. ఇప్పటి వరకు 45 సినిమాల్లో నటించాడు. బాహుబలి మాత్రం అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. విశాఖలో శుక్రవారం ప్రారంభమైన బాలల జాతీయ చిత్రోత్సవానికి అతిథిగా నిఖిలేశ్వర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతను బాహుబలి గురించి కొన్ని సంగతులు వెల్లడించాడు.

బాహుబలి చిత్రం తనకు లభించిన గొప్ప అవకాశమనీ, అప్పట్నించీ తన పేరు చిన్న బాహుబలి అయిపోయిందని చెప్పాడు. బాహుబలి కంక్లూజన్ లోను తాను కనిపిస్తాననని, అయితే బాహుబలి మొదటి భాగంలో ఉన్నంత సేపు కనిపించలేననని వెల్లడించాడు. దాదాపు ఐదు నిముషాల సేపు తన పాత్ర ఉంటుందని, అయినా ఆ చిత్రంలో ఉన్నాను అన్న విషయం తనకు ఆనందం కలిగిస్తుందని చెప్పాడు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus