తుమారీ సులు రీమేక్ లో జ్యోతిక!

  • February 19, 2018 / 07:31 AM IST

ఇటీవల విడుదలైన “నాచియార్” చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్ గా నటించి నటిగా తన రీఎంట్రీలో అందరినీ అలరించిన జ్యోతిక ఇకపై వరుస సినిమాల్లో నటించి మళ్ళీ నటిగా బిజీ అయ్యేందుకు సన్నద్ధమవుతోంది. అందుకే తన తదుపరి చిత్రాల ఎంపికలో తలమునకలైంది జ్యోతిక. తన తదుపరి చిత్రంగా బాలీవుడ్ లో డీసెంట్ గా హిట్ గా నిలిచిన “తుమారీ సులు” చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు ఉత్సాహం చూపుతుందని తెలుస్తోంది. పెళ్ళైన మహిళ కుటుంబం కోసం లేట్ నైట్ రేడియో జాకీగా వర్క్ చేయడమే ఈ చిత్రంలోని పాయింట్.

కథ కాస్త అటు ఇటుగా తెలుగు క్లాసిక్ హిట్స్ లో ఒకటైన “మిస్టర్ పెళ్ళాం”లా ఉన్నప్పటికీ.. రేడియో జాకీగా విద్యాబాలన్ నటన సినిమాకి ప్లస్ అవ్వడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో ఆదరించారు. మరి జ్యోతిక సెక్సీ ఆర్జేగా విద్యాబాలన్ రేంజ్ లో అలరించగలుగుతుందా లేక తమిళానికి తగ్గట్లు కథలో ఏవైనా మార్పులు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే.. కథ మాత్రం జ్యోతిక ఇమేజ్ కి బాగా సింక్ అవుతుంది.

ఎలాగూ తమిళంలో రీమేక్ చేస్తే.. తెలుగులోనూ డబ్బింగ్ రూపంలో విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి.. “ఠాగూర్” తర్వాత జ్యోతికను మళ్ళీ తెలుగు తెరపై చూసుకోవచ్చన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus