బిగ్ బాస్ షో వెనుక ఉన్న సంగతులు చెప్పిన జ్యోతి

  • July 31, 2017 / 02:40 PM IST

బిగ్ బాస్ షో.. తెలుగు రియాల్టీషోలో కొత్త సంప్రదాయానికి తెరలేపిన కార్యక్రమం. దీనిని తెలుగు ప్రేక్షకులు స్వాగతించారు. అత్యధిక రేటింగ్ అందించి రికార్డ్ సృష్టించారు. ఈ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్స్ లో మొదటిగా జ్యోతి హౌస్ నుంచి ఎలిమినేటి అయ్యారు. హౌస్ మేట్స్ తో గొడవలు కారణంగా ఆమెను బయటికి పంపించారు. కార్యక్రమం నుంచి బయటికి వచ్చిన జ్యోతి తొలి సారి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో షో రహస్యాలు బయటపెట్టారు.

“నేను హౌస్ మేట్స్ తో గొడవలు పడలేదు. అందరం చాలా హ్యాపీగా అంత్యాక్షరి ఆడుకున్నాం. డైలాగులు చెప్పుకుంటూ సరదాగా గడిపాము. ఆ సందర్భాలను బిగ్ బాస్ షోలో ప్రసారం చేయడం లేదు. కేవలం అప్పుడప్పుడు గొడవపడిన వీడియోలు చూపించి సంచలనం చేస్తున్నారు” అని వివరించారు. తాను ఎలిమినేట్ అయినా బిగ్ బాస్ షో అంటే ఇప్పటికీ చాలా ఇష్టమని, వైల్డ్ కార్డు ఎంట్రీ వస్తే తప్పకుండా పాల్గొంటానని తన కోరికని బయటపెట్టారు. మరి బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus