KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

‘మన శంకర వరప్రసాద్ గారు’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. తన నెక్స్ట్ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.’మెగా 158′ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ‘వాల్తేరు వీరయ్య’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న కాంబో కావడంతో.. మొదటి నుండీ ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘కెవిఎన్’ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజుని పురస్కరించుకుని టైటిల్ గ్లింప్స్ ను వదిలింది చిత్రబృందం.

KAAKA

ఇటీవల ప్రచారం జరిగినట్టుగానే ఈ సినిమాకి ‘కాకా'(KAAKA) అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు ఈ గ్లింప్స్ ద్వారా రివీల్ చేశారు. అలాగే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ‘అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రిస్’ అనే ఆక్వా కంపెనీ ఓనర్ సత్యంగా ఈ సినిమాలో చిరు కనిపించబోతున్నారు. అలాగే సునీల్, గెటప్ శీను కూడా ఈ గ్లింప్స్ లో కనిపించడం విశేషం. గెటప్ శీను పాత్ర హీరోకి ఓ కీ చెయిన్ ఇవ్వడం.

అది రొయ్యలు ఉన్న వాటర్లో పడిపోవడం. దానిని చిరు మేగ్నెట్ సాయంతో తీసుకోవడం. అప్పుడు కీ మాత్రమే కాకుండా చాలా గన్నులు దానిని అతుక్కుని పైకి రావడాన్ని మనం గమనించవచ్చు. తర్వాత గన్నులతో రౌడీ గ్యాంగ్ పై దాడి చేసిన విజువల్ కూడా ఉంది. సొ సత్యం పాత్రకి మరో యాంగిల్ ఉందని అర్దం చేసుకోవచ్చు. అలాగే కూతురి కోసం ఓ సాధారణ వ్యక్తిగా జీవనం కొనసాగిస్తున్నట్టు కూడా రివీల్ చేశారు. గ్లింప్స్ కట్ మెగాస్టార్ అభిమానులు మెచ్చే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus