మే 30 న ‘కబాలి’ ఆడియో..!

  • May 12, 2016 / 02:09 PM IST

పా రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కబాలి’. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండగా.. మే 30 న చెన్నై వేదికగా ఈ చిత్ర ఆడియో ను విడుదల చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ చిత్రాన్ని జూన్ 1 న  ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ఇటీవలే విడుదల చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అమితమైన ఆదరణ లభించడంతో.. చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. రజనీ గ్యాంగ్ స్టర్ పాత్రలో ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే జంటగా నటిస్తోంది. కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus