సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గ్యాంగ్ స్టర్ గా నటించిన కబాలి సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగి పోయాయి. ప్రపంచ వ్యాప్తంగా జూలై 1 న రిలీజ్ కానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 29 న ఆడియో రిలీజ్ వేడుక ఉంటుందని స్పష్టం చేసాయి.
రంజిత్ పా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రల్ 14 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ కుదరలేదు. జూన్ 3 న రిలీజ్ పక్కా అని ప్రకటించారు. తమిళినాడులో ఎన్నికల వల్ల పోస్ట్ పోన్ అయింది. జూలై 1 కి అయినా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.