‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని బాలీవుడ్లో ‘కభీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా సందీప్ రెడ్డి వంగా నే డైరెక్ట్ చేసాడు. షాహిద్ కపూర్, కైరా అద్వానీ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం.. విడుదలైన రోజునే కొంతమంది విశ్లేషకులు నెగిటివ్ రివ్యూలు రాసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రేక్షకులకు టేస్ట్ లేదని.. కామెంట్లు కూడా చేశారు. దీంతో ఈ సినిమా అక్కడ ఆడుతుందని ఎవరూ అనుకోరు. కానీ ఆ నెగిటివిటీని అంతా పక్కకు నెట్టి ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. సల్మాన్ చిత్రమైన ‘భారత్’ కూడా ఈ రేంజ్ కల్లెక్షన్లని నమోదు చేయలేదు.
తాజాగా ఈ చిత్రం డబుల్ సెంచరీ కూడా కొట్టేసింది. 13 రోజుల్లోనే 200కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. సల్మాన్ ‘భారత్’ చిత్రం 200 కోట్లు వసూల్ చేయడానికి 14రోజుల సమయం పట్టింది. కానీ మీడియం రేంజ్ హీరో షాహిద్ కపూర్ మాత్రం 13 రోజుల్లోనే ఆ ఫీట్ ను సాధించడం విశేషం. ఇప్పటికి ఈ చిత్రం అక్కడ స్ట్రాంగ్ గా ఉండటం విశేషం. దర్శకుడు సందీప్ ఈ చిత్రంతో అక్కడ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పుడు మరిన్ని సౌత్ సినిమాలను.. అందులోనూ టాలీవుడ్ సినిమాలని రీమేక్ చేయడానికి అక్కడి బడా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.