విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ను మాత్రం రీక్రియేట్ చేయలేకపోయాడు

  • April 8, 2019 / 06:44 PM IST

తెలుగు సినిమాలో ఇండస్ట్రీలో సరికొత్త సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని అదే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. “కబీర్ సింగ్” పేరుతో షాహిద్ కపూర్-కీయారా జంటగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ఇవాళ విడుదలైంది. ప్రతి ఫేమ్ “అర్జున్ రెడ్డి” సినిమాకి జిరాక్స్ కాపీలా ఉంది. ఇక్కడ అమిత్ గా నటించిన నటుడే అక్కడ కూడా అమిత్ పాత్ర పోషించడం విశేషం. కెమెరా ఫ్రేమింగ్స్ మాత్రమే కాదు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సేమ్ టు సేమ్ ఉంది.

మరి అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో క్రియేట్ చేసిన సెన్సేషన్ కానీ.. మ్యాజిక్ కానీ బాలీవుడ్ లో “కబీర్ సింగ్” రీక్రియేట్ చేయగలుగుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే.. విజయ్ దేవరకొండ ఎటైర్ ను అచ్చుగుద్దినట్లుగా దించేసిన షాహిద్ కపూర్.. యాటిట్యూడ్ ను మాత్రం రిపీట్ చేయలేకపోయాడు. సినిమాలో రీక్రియేట్ చేయగలడన్న నమ్మకం కూడా జనాలకి లేదు. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ కూడా తప్పకుండా చూస్తారు కాబట్టి.. షాహిద్ నటనకి వాళ్ళు ఎలాంటి రేటింగ్ ఇస్తారో చూడాలి. బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా మీద అంచనాలున్నాయి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus