కమల్ హాసన్ డ్రీమ్ ప్రొజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చిన కాజల్

  • May 22, 2019 / 04:34 PM IST

కమల్ హాసన్ డ్రీమ్ ప్రొజెక్ట్ అయిన “ఇండియన్ 2” బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ఆగిపోయిందని వార్తలు రావడం, ఆ వార్తల్ని టీం మెంబర్స్ కానీ కమల్ హాసన్ కానీ ఖండించకపోవడం, కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో బిజీ అవ్వనుండడంతో అందరూ అది నిజమే అనుకున్నారు. కట్ చేస్తే.. “ఇండియన్ 2” ఆగిపోలేదని, ఒక చిన్న షెడ్యూల్ పూర్తయ్యిందని, త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలవ్వనుందని కాజల్ క్లారిటీ ఇచ్చింది.

అలాగే.. తన కెరీర్ లో ఇప్పటివరకూ నటించిన చిత్రాల్లో “ఇండియన్ 2” పెద్ద ప్రొజెక్ట్ అనీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనేందుకు వెళుతున్నానని చెప్పింది కాజల్ అగర్వాల్. కాజల్ ఇచ్చిన క్లారిటీ పుణ్యమా అని కమల్ హాసన్ ఫ్యాన్స్ కొందరు ఖుష్ అయినప్పటికీ.. రీసెంట్ గా కమల్ హాసన్ “స్వంతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది ఒక హిందువు” అని కామెంట్ చేసి అల్లరిపాలై ఉన్న కారణంగా ఇప్పుడు “ఇండియన్ 2” ప్రొజెక్ట్ చేయడం అనేది లేనిపోని గొడవలకు తావు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. మరి కమల్ వాటికి ఎలా సమాధానం చెప్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus