హీరోయిన్స్ కష్టాలపై స్పందించిన కాజల్ అగర్వాల్

  • April 3, 2017 / 09:48 AM IST

సినీ పరిశ్రమలో అమ్మాయిలకు ఇబ్బందులు తప్పవని కొంతమంది హీరోయిన్లు పలు ఇంటర్వ్యూ లో వెల్లడించారు. మొన్న రాధికా ఆప్టే, నిన్న అర్చన, ఈరోజు మాధవీలత ఇలా కథానాయికగా పలు చిత్రాల్లో నటించిన భామలు తమని డైరక్టర్లు, నిర్మాతలు బెడ్ రూమ్ కి పిలిచారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ ని ప్రశ్నించగా ఆమె మాట్లాడుతూ.. “ఆ ప్రస్తావన నాదగ్గర ఎప్పుడూ రాలేదు. అయితే కోర్కెలు తీరిస్తేనే అవకాశం ఇస్తామని డైరక్టర్లు ఒత్తిడి తెచ్చిన సంగతిని చాలామంది హీరోయిన్లు నాతో చెప్పారు. అలా ఆర్టిస్టులను అవమానించడం బాధాకరం” అని వివరించారు.

మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని అడగగా.. ” హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్ గానే చూస్తారు. అందుకోసమే మమ్మల్ని తీసుకుంటారు. నేను పరిశ్రమలోకి వచ్చిన కొత్తల్లో అందాలు ఆరబోసే పాత్రలు కొన్ని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం నాకు నచ్చిన సినిమాలనే ఎంచుకుంటున్నాను” అని కాజల్ స్పష్టం చేసింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus