వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గత దశబ్దన్నర కాలం నుంచి ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఈమె తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇలా వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఈ ముద్దుగుమ్మ ఏప్రిల్ నెలలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇకపోతే తన కుమారుడికి ఆరు నెలలు పూర్తి కావడంతో కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తన కుమారుడి ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈమె ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉండి పూర్తిగా తన మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక బాబు పుట్టిన తర్వాత నిత్యం తన వెంటే ఉంటూ ఒక తల్లిగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ తన కుమారుడి ఫోటోని షేర్ చేస్తూ ఆరు నెలలు పూర్తి కావడంతో.. నా జీవితంలో ఈ ఆరు నెలల కాలం ఎలా గడిచిపోయిందో కూడా నాకు తెలియదు ఈ ఆరు నెలలు ఎంతో సంతోషంగా గడిచిపోయాయని తెలిపారు.
ఇలా యంగ్ గా ఉన్నప్పుడు తల్లిగా నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తున్నానా లేదా అనే భయం నన్ను వెంటాడుతూనే ఉందని ఇప్పటికే తాను ఒక గొప్ప తల్లి ఎలా అవ్వాలో నేర్చుకుంటున్నాను అంటూ తెలియచేశారు. ఇలా కాజల్ అగర్వాల్ తన కొడుకు ఫోటోలను షేర్ చేస్తే తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తించడం పట్ల ఎమోషనల్ అయ్యారు.
కాజల్ అగర్వాల్ కుమారుడికి ఆరు నెలలు కావడంతో ఈమె కూడా సినిమాలలో బిజీ అయ్యారు. ఇప్పటికే భారతీయుడు 2 సినిమాతో ఈమె బిజీగా మారిపోయారు అలాగే చంద్రముఖి 2 లో కూడా కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!