వైరల్ అవుతున్న కాజల్, గౌతమ్ ల హనీమూన్ పిక్స్..!

టాలీవుడ్ చందమామ కాజల్ అక్టోబర్ 30న ప్రముఖ బిజినెస్మెన్ గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అతి తక్కువ మంది బందుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి చాలా నిరాడంబరంగానే జరిగింది. ఇక పెళ్ళైన తరువాత తన భర్తతో కలిసి హనీమూన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్లింది కాజల్. ప్రస్తుతం వీళ్ళు అక్కడి ప్రశాంతమైన వాతావరణంలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక హనీమూన్ కు వెళ్లడానికి ముందే తన సోషల్ మీడియా ఖాతాల్లో… కాజల్ అగర్వాల్ అని ఉన్న తన పేరును కాస్తా కాజల్ కిచ్లూగా చేసింది కాజల్. అంతేకాదు కవర్ ఫోటోని సైతం ఛేంజ్ చేసింది. ఈ జంట దీపావళికి తిరిగి ఇండియాకి తిరిగి వస్తారని సమాచారం. కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సంబరాలను జరుపుకోవాలని వీరు భావిస్తున్నట్టు తెలుస్తుంది.ఇక ఆ వేడుకలు ముగిసిన తరువాత ఇప్పటివరకూ తాను సైన్ చేసి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను ఫినిష్ చెయ్యాలని కాజల్ భావిస్తోందట.

మొదటగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం షూటింగ్లో పాల్గొనడానికి కాజల్ రెడీ అయ్యిందట. అయితే ఇప్పుడు చిరు కరోనా భారిన పడ్డారు కాబట్టి..ఆ చిత్రానికి సంబంధించి మిగతా తారాగణంతో కాజల్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నట్టు తెలుస్తుంది. సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి.. కాజల్, గౌతమ్ ల హనీమూన్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

పెళ్లి ఫోటోలు
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36


Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus