ప్రశాంత్ వర్మ కి కాజల్ చెప్పిన మాటేంటో తెలుసా?

  • August 3, 2018 / 06:17 AM IST

విభిన్నంగా అలోచించి ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమా “అ!”. ఈ చిత్రం అందరితో “అ..” అనిపించింది. అలాగే అతనికి ఆఫర్లు తెచ్చిపెట్టాయి. అతను మాత్రం రాజశేఖర్ తో మూవీ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన పీఎస్వీ గరుడ వేగ తో డాక్టర్ రాజశేఖర్ పూర్వవైభవాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్  ప్రశాంత్ వర్మ చెప్పిన కథకి కనెక్ట్ అయ్యారు. అతనితోనే సినిమా చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పారు. “నా తర్వాతి సినిమా అదేనని చెప్పడానికి సంతోషిస్తున్న అది ఎలా ఉంటుందంటే…. అ!ద్భుతంగా ఉంటుంది” అని ట్వీట్ చేశారు. తన తర్వాతి సినిమా “AWEsome ” అంటూ ట్వీట్ చేశారు.

వీరి ఇద్దరి కలయికలో సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సెలక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకోవాలని అనుకున్నారట. ప్రశాంత్ వర్మ మొదటి సినిమా అ!లో కాజల్ లీడ్ రోల్ చేసింది. అందుకే ఆ చనువు కొద్ది కాజల్ ను అడిగాడట. అందుకు కాజల్ అదిరిపోయే సమాధానం చెప్పినట్లు సమాచారం. “నా కెరియర్ కొన్నాళ్లు కొనసాగించే ఆలోచనలోఉన్నాను. ఇప్పుడు ఇలాంటి ఆఫర్స్ చేయలేను” అని చెప్పిందంట.  అంటే రాజశేఖర్ తో చేస్తే ఇక ఆమె కెరియర్ అయిపోతుందని అనుకుందా? అందుకే ఇలాంటి కామెంట్ చేసిందా? అని అంటున్నారు.  కాజల్ మాటలపై సినీ వర్గాల్లో జోరుగానే చర్చ సాగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus