టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ వయసు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా కనిపిస్తోంది. నిన్న రిలీజ్ అయిన ఎమ్యెల్యే సినిమా చూసినవారందరూ ఇదే మాట చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ సరసన కొత్త అమ్మాయిలా ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో పోటీని తట్టుకొని పదమూడేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది. గ్లామర్ కి స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు డీ గ్లామర్ రోల్స్ పోషిస్తోంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయి సంచలనం సృష్టించిన “అ” మూవీలోనూ కాజల్ మేకప్ లేకుండా నటించింది.
అభినయంతో కన్నీరు తెప్పించింది. ప్రస్తుతం మరో డీ గ్లామర్ రోల్ చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రానౌత్ క్వీన్ సినిమాలో డీ గ్లామర్ గా నేచురల్ గా నటించింది. ఆ మూవీలో ఆమె నటనకు జాతీయ ఉత్తమ అవార్డు గెలుచుకుంది. ఇప్పుడు ఈ మూవీని తమిళంలో “పారిస్ పారిస్” పేరుతో రీమేక్ చేస్తున్నారు. కంగనా పోషించిన క్వీన్ పాత్రలో కాజల్ నటిస్తోంది. ఈ మూవీలో కాజల్ కూడా ఎటువంటి మేకప్ లేకుండా డిగ్లామర్ గా నటిస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఈ సినిమాతో కాజల్ మరింతమంది అభిమానులను సొంతం చేసుకుంటుందని చిత్ర బృందం భావిస్తోంది. అవార్డులు సైతం అందుకుంటుదని చెప్పింది.