సమ్మర్ లో మరింత హీట్ పెంచుతున్న కాజల్..!

  • May 21, 2019 / 04:25 PM IST

కెరీర్ ప్రారంభించి 12 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా టాప్ హీరోయిన్ గానే కొనసాగుతుంది కాజల్ ఆగర్వాల్. కుర్ర హీరోయిన్ల పోటీ తట్టుకుంటూ కూడా ఇలా స్టార్ డమ్ ను మెయింటైన్ చేయడం… అంత సులువు కాదు. అయినా ఈ విషయంలో కాజల్ ను మెచ్చుకోవలసిందే. ఇదిలా ఉండగా కాజల్ నటిస్తున్న తాజా చిత్రం ‘సీత’. ఈ చిత్రం మే 24 న విడుదల కాబోతుంది. ఓ పక్క ఈ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంటూనే మరో పక్క హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ కుర్రకారుని హీటెక్కిస్తోంది.

ఇటీవల ఓ రెడ్ హాట్ లుక్ ని తన ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది.పింక్ బ్యాక్ గ్రౌండ్ .. పింక్ – రెడ్ కాంబో స్ట్రాప్ లెస్ డ్రెస్ లో కాజల్ లుక్ నిజంగా అదిరిపోయింది. అసలు కాజల్ ఒంటి పైన బట్టలంటూ ఉన్నాయా అనేలా ఆ ఫోటో ఉంది. ఈ ఫొటో ఇలా బయటకి వచ్చిందో లేదో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఏదేమైనా కాజల్ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని ఈ పిక్ మరోసారి ఋజువు చేసింది. ఇక ‘సీత’ చిత్రంలో కాజల్ ఓ నెగటివ్ రోల్ లో కనిపించబోతుంది. ఈ చిత్రానికి తేజ డైరెక్టర్. తేజ డైరెక్షన్లో కాజల్ నటించడం ఇది మూడో సారి. మరి ఈ చిత్రం కాజల్ కు ఎటువంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus