ఆ వార్త విని ఎటు తేల్చుకోలేకపోతున్న కాజల్ ఫ్యాన్స్!

  • November 3, 2018 / 12:19 PM IST

కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకి స్పెషల్ గా పరిచయం చేయనక్కర్లేని పేరు. ఈ ముద్దగుమ్మ చందమామ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో దాదాపుగా అందరు అగ్ర హీరోల సరసన నటించడమే కాకుండ యువ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా దూసుకుపోతుంది. ఈ అమ్మడు ప్రస్తుతం కమల్ హాసన్ క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం కొట్టేసింది. ఇక తెలుగు లో తనకి మొదటి ఛాన్స్ ఇచ్చిన తేజ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తుంది.

ఇది ఇలా ఉంటె కాజల్ పైన ఒక రూమర్ ఫిలింనగర్ చుట్టూ చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ చందమామ ఒక యువ హీరో తో డేటింగ్ చేస్తుందని ఎక్కడ చూసిన వారే కనిపిస్తున్నారంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి. ఒక అగ్ర నిర్మాత కొడుకు అయిన ఆ యువ హీరో కాజల్ అందానికి ఫ్లాట్ అవ్వగా షూటింగ్ అయిపోతే చాలు ఇద్దరు కలసి చెక్కర్లు కొడుతున్నారనే వార్త ఇటీవలే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయిందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus