టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ కి 2016 నిరాశపరిచింది. ఆమె నటించిన బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలు ఫెయిల్ అయ్యి తన కెరీర్ ని చిక్కుల్లో పడేసింది. ఏడాది చివర్లో జనతాగ్యారేజి చిత్రంలో “నేను పక్కా లోకల్” అంటూ స్పెషల్ సాంగ్ తో హంగామా చేసింది. ఆ చిత్రం విజయం సాధించినప్పటికీ అక్రెడిట్ కాజల్ అకౌంట్ లో పడలేదు. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన ఖైదీ నంబర్ 150 కాజల్ కి కెరీర్ మైలేజ్ ని పెంచింది. మళ్లీ ఫామ్లోకి తీసుకొచ్చింది. ఈ విజయానందంలో ఉన్న ఈ భామ తాజా గా “మై సౌత్ దివ” హాట్ క్యాలండర్ కోసం వెరీ హాట్ గా ఫోజులిచ్చింది.
రీసెంట్ గా జరిగిన ఈ ఫోటో షూట్ వీడియో యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ అందుకుంటోంది. ఇదివరకు ఎప్పుడూ కనిపించనంత సెక్సీ గా ఇందులో కాజల్ కనిపిస్తోంది. ఈ క్యాలండర్ లో కాజల్ తో పాటు దక్షిణాదికి చెందిన పాపులర్ హీరోయిన్స్ హాట్ ఫొటోస్ ఉండనున్నాయి. వాటిని చూడాలంటే మరికొంతకాలం ఆగాల్సి ఉంటుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.