ఉపేంద్ర సరసన నటించడానికి సైన్ చేసిన కాజల్

  • November 25, 2019 / 11:45 PM IST

హీరోయిన్ గా 50 సినిమాల్లో నటించి.. అదే స్పీడ్ తో 100 సినిమాలకి చేరువలో ఉన్న కథానాయకి కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భీభత్సమైన స్టార్ డమ్ ఉన్న కాజల్ కి ఈమధ్య ఎందుకో ఆశించిన స్థాయి అవకాశాలు రావడం లేదు. మరీ ముఖ్యంగా “రణరంగం” డిజాస్టర్ అనంతరం కాజల్ ని పట్టించుకొనే పెద్ద హీరోలు లేకుండాపోయారు.

అందుకే.. సినీ పరిశ్రమలో 16 ఏళ్లుగా హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నది. అక్కడ తొలి సినిమా సూపర్ స్టార్ ఉపేంద్రతో చేయనుంది. “ఐ లవ్ యూ” తర్వాత కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, ఆర్.చంద్రు దర్శకత్వంలో “కబ్జా” సినిమా చేస్తున్నాడు.. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు.. ఈ మూవీలో కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన కాజల్ ఇప్పుడు క్రేజ్ తగ్గడం వల్లే కన్నడకి జంప్ అయ్యిందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus