మరో బాబాయ్ తో జతకట్టనున్న కాజల్

  • April 18, 2016 / 01:08 PM IST

రామ్ చరణ్ తో మూడు సినిమాల్లో నటించిన అనంతరం ఇటీవల చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ తో “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమాలో రొమాన్స్ చేసిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు మరో బాబాయ్ తో కలిసి ఆడిపాడనుందని తెలుస్తోంది. ఎన్టీయార్ తో “బృందావనం, టెంపర్” చిత్రాల్లో సరసాలాడిన కాజల్.. ఇప్పుడు ఎన్టీయార్ కు బాబాయ్ అయిన బాలకృష్ణతో జతకట్టనుందని సమాచారం అందుతోంది.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బాలయ్య 100వ సినిమాలో హీరోయిన్ గా తొలుత నయనతార, అనుష్కల పేర్లు వినిపించినప్పటికీ.. చివరాఖరికి బాలయ్య స్వయంగా కాజల్ ను ఎంపిక చేసాడని విశ్వసనీయవర్గాల సమాచారం!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus