ఎట్టకేలకు విడుదలవుతున్న కాజల్ హిందీ సినిమా!

  • April 18, 2016 / 01:22 PM IST

ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కావాల్సిన కాజల్ హిందీలో నటించిన “దో లఫ్ఝోంకి కహానీ” కారణాంతరాల వలన అప్పుడు విడుదల కాలేకపోయింది. ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎటువంటి చడీచప్పుడు లేకపోవడంతో.. ఇక విడుదలవ్వదేమో అనుకొన్నారందరూ.

ఎట్టకేలకు ఆ చిత్రాన్ని జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. రణదీప్ హుడా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో కాజల్ కళ్లు లేని అమ్మాయిగా నటిస్తుండగా.. ఈ హృద్యమైన ప్రేమకథకు దీపక్ తిజోరి దర్శకత్వం వహించాడు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus