“తిన్నామా పడుకున్నామా తెల్లారిందా” అనే రీతిలో “రెమ్యూనరేషన్ తీసుకొన్నామా, సినిమాలో నటించామా, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఊరు వెళ్లిపోయామా” అనే ఫార్మాట్ ను గత కొంత కాలంగా ఫాలో అవుతూ వస్తున్న మన తెలుగు సినిమా హీరోయిన్లు ఈమధ్య హీరోల మీద కామెంట్స్ చేయడం మొదలెట్టారు. ఇంతకుమునుపు రాధికా ఆప్టే, తాప్సీలు కూడా మన సౌత్ హీరోలపై, డైరెక్టర్లపై కామెంట్స్ చేసి అభాసుపాలయ్యారు. ఇప్పుడు ఆ జాబితాలో క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా చేరింది. అయితే.. ఇక్కడ జరిగిందంతా సరదాకే అనుకోండి.
అసలు మేటర్ ఏంటంటే.. “నేనే రాజు నేనే మంత్రి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాణా నిర్వహిస్తున్న “నెంబర్ 1 యారీ” షోకి నవదీప్ తోపాటు వచ్చిన కాజల్ తనతో కలిసి నటించిన ఎన్టీయార్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ పై కొన్ని ఫన్నీ కామెంట్స్ చేసింది. ఈ క్రింది పేర్లలో ఎవరీలో ఏం మార్పు వస్తే మంచిది? అని రాణా అడిగిన ప్రశ్నకు కాజల్ ఈ విధంగా సమాధానం చెప్పింది కాజల్.
ఎన్టీయార్ : కాస్త యాక్టివ్ నెస్ తగ్గించుకొంటే మంచిది,
ప్రభాస్ : కాస్త ఎనర్జీ ఉంటే బాగుంటుంది,
మహేష్ బాబు : ఆయన కొన్నిసార్లు మాట్లాడకుండా ఉంటే మంచిది, ఆయన వాగుతూనే ఉంటాడు,
పవన్ కళ్యాణ్ : ఆయన కాస్త మాట్లాడితే బాగుంటుంది.
ఇలా ఒక్కో హీరోపై ఒక్కో విధమైన కామెంట్ చేసిన కాజల్ ను చూసి నవదీప్, రాణాలు షాక్ అయిపోయారు. మరి ఈ ఫన్నీ స్టేట్ మెంట్స్ ను అభిమానులు ఎలా తీసుకుంటారో చూడాలి!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.