లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ .. ఆ తర్వాత తన పెళ్లి గురించి మరిచిపోయింది. మగధీర, చందమామ, బిజినెస్ మ్యాన్, టెంపర్ వంటి విజయాలతో టాలీవుడ్ యువరాణిగా పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడుకి పెళ్లిపై మనసు వెళ్లిందని సమాచారం. తన చెల్లెలు నిషా అగర్వాల్ కి ఏడాది క్రితం ఘనంగా పెళ్లి చేసిన ఈ సుందరి పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతోందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.
సమంత లాగా ప్రేమ పెళ్లి చేసుకోనని స్టేట్ మెంట్లు ఇచ్చిన కాజల్ .. ప్రస్తుతం ఓ బిజినెస్ మ్యాన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా హోటల్స్ ఉన్న ప్రియుడితో కలిసి తిరుగుతోందని, అతన్ని త్వరలో పెళ్లిచేసుకోబోతున్నట్లు టాలీవుడ్, కోలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కాజల్ తనకి లైఫ్ ఇచ్చిన తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో హీరోయిన్ గానటిస్తోంది. కాజల్ కి తెలుగులో ఇదే ఆఖరి చిత్రం కావచ్చని టాక్. మరి దీనిపై టాలీవుడ్ క్వీన్ ఏమనంటుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.