అనుష్క సినిమా కొట్టేసింది!

స్టార్ హీరోయిన్ అనుష్కకు వచ్చిన అవకాశాన్ని కాజల్ కొట్టేసిందనే మాటలు వినిపిస్తున్నాయి. సర్ధార్ గబ్బార్ సింగ్, బ్రహ్మోత్సవం వంటి ఫ్లాప్ చిత్రాల తరువాత కాజల్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ నేపధ్యంలో ఈ అమ్మడుకి తమిళం నుండి ఓ పెద్ద ఆఫర్ వచ్చిందని సమాచారం.

శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటిస్తున్న సినిమాలో కథానాయికగా మొదట అనుష్కను ఎన్నుకున్నారు. అయితే ఇప్పుడు అనుష్కను కాదని.. కాజల్ ను సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అజిత్ 57వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus