Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ ప్రాజెక్ట్ కల్కి సీక్వెల్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ విజువల్ గ్రాండియర్‌కు సంబంధించిన కొత్త అప్‌డేట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Kalki 2

మొదటి భాగమైన కల్కి 2898 AD భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే ఉత్సాహంతో ఇప్పుడు సీక్వెల్‌పై మేకర్స్ మరింత గ్రాండ్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ‘కర్ణ 3102 BC’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్ వినగానే కథలోని మైథలాజికల్ ఎలిమెంట్ ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతోంది.

ముఖ్యంగా ఈ సీక్వెల్‌లో కథ మొత్తం కర్ణుడి పాత్ర చుట్టూ తిరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొదటి భాగంలోనే ప్రభాస్ పాత్రకు కర్ణుడితో ఉన్న కనెక్షన్‌పై సూచనలు ఇచ్చారు. ఇప్పుడు పార్ట్ 2లో అదే అంశాన్ని మరింత డీప్ గా చూపించబోతున్నారట. కర్ణుడి పాత్రలో ప్రభాస్ మరింత పవర్‌ఫుల్‌గా కనిపించబోతున్నాడని ఫ్యాన్స్ ఇప్పటికే అంచనాలు పెంచుకున్నారు.

ఇక షూటింగ్ విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతారని సమాచారం. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో కనిపించనుండగా, హీరోయిన్ విషయానికి వస్తే, మొదటి భాగంలో నటించిన దీపికా పదుకొనే స్థానంలో ఇప్పుడు సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. ఈ మార్పు కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి, టైటిల్ నుంచి కథ వరకు ప్రతి అంశం సినిమాపై హైప్‌ను పెంచుతోంది. ‘కల్కి 2’ మరోసారి ఇండియన్ సినిమా సత్తాని ప్రపంచానికి చూపించే ప్రాజెక్ట్‌గా నిలుస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus