Kalki 2898 AD: కల్కి ఈవెంట్ విశేషాలు ఇవే.. ఈవెంట్ అక్కడే జరగనుందా?

  • June 11, 2024 / 03:05 PM IST

ప్రభాస్ (Prabhas)  నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి మూవీ  (Kalki 2898 AD)  రిలీజ్ కు 16 రోజుల సమయం ఉండగా ఈ సినిమా ఈవెంట్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో కల్కి మూవీ ఈవెంట్ జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఈవెంట్ కు చంద్రబాబు గెస్ట్ గా హాజరవుతారని వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. కల్కి మూవీ ఈవెంట్ కు లక్ష మంది అభిమానులు హాజరయ్యే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే ఈ వార్తలను నమ్మాల్సి ఉంటుంది. ప్రభాస్ కల్కి మూవీ ప్రభాస్ ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నమైన సినిమా అనే సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ టాలెంట్ ను పాన్ ఇండియా ప్రేక్షకులకు కల్కి మూవీ పరిచయం చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత కొన్ని వారాల వరకు మరే సినిమా విడుదల కావడం లేదనే సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడీ సినిమా అంచనాలను మించి విజయం సాధిస్తే ఈ జానర్ లో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది.

కమల్ హాసన్  (Kamal Haasan) ఈ సినిమాలో మెయిన్ విలన్ అని చాలామంది భావించినా శాశ్వత ఛటర్జీ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కల్కి 2898 ఏడీ సులువుగా 1000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందని టాక్ అద్భుతంగా ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరుగుతాయని చెప్పవచ్చు. ఇప్పటికే రిలీజైన కల్కి ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus