ఎఫ్2 సక్సెస్ తో వరుస అవకాశాలు అందుకుంటోంది

Advertisement

సినిమా రంగంలో హిట్‌కు ఉన్న ఆవశ్యకత అంతాఇంతా కాదు. నేటి రోజుల్లో సినిమా హిట్టయితే కలెక్షన్లకు ఆకాశమే హద్దు అవుతోంది. అదే ఫ్లాప్‌ అయితే కనీసం పెట్టుబడిలో మినిమమ్‌ కాదు కదా సగం కూడా రావడం లేదు. దాంతో హిట్‌లో ఉన్న ఆర్టిస్టుల చుట్టూ పరిశ్రమ పరిభ్రమిస్తూ ఉంటుంది. అయితే విజయవంతమైన చిత్రాలు ఒక్కోసారి ఫ్లాపు అవుతుంటాయి. హీరోలకే కాదు హీరోయిన్లకు కూడా సక్సెస్‌ ప్రాతిపదికమీదే ఎక్కువగా అవకాశాలు లభిస్తుంటాయి.

రాజా ది గ్రేట్‌ వంటి హిట్‌ తర్వాత జవాన్‌, పంతం, నోటా తదితర ఫెయిల్యూర్లు అందాల భామ మెహరీన్‌కు టెన్షన్‌ను కలిగించాయి. ఇక తన కెరీర్‌ ఏమౌతుందోనని…అవకాశాలు తగ్గిపోతున్న దశలో ఎఫ్‌-2 చిత్రం ఆమెలో కొత్త ఆశలను రేకెత్తించింది. ఆ చిత్రంలో తన పాత్ర బాగా పండటం కూడా ఆమెకు మళ్లి అవకాశాలను వచ్చేలా చేసిందట. అయినప్పటికీ కెరీర్‌ బావుండాలంటే పాత్రల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఆమె అంగీకరిస్తోందట.

ప్రస్తుతం గోపీచంద్‌ కథానాయకుడిగా తిరు దర్శకత్వంలో చాణక్య చిత్రంలో నటిస్తున్న ఆమెకు ఇప్పుడు మరో మంచి అవకాశం వెతుక్కుంటూ వచ్చినట్లు సమాచారం. తుగ్లక్‌ చిత్రం చేస్తున్న కల్యాణ్‌రామ్‌…దాని తర్వాత సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోయే ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్‌ సరసన మెహరీన్‌ను కథానాయికగా ఎంపిక చేశారని పరిశ్రమలో వినిపిస్తోంది. ఇందులో అభినయానికి స్కోప్‌ ఉన్న పాత్రలో మెహరీన్‌ కనిపించనున్నట్లు పరిశ్రమ వర్గాల భోగట్టా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus