టాలీవుడ్ లోనే కాదు..అన్ని వుడ్స్ లోను…గాసీప్స్ సృష్టించే వారికి కొదవే లేదు…ఇక ఆ గాసిప్స్ నమ్మి దాన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళు అయితే…ఇనీకీ ఇద్దరు ఉంటారు….ఇదిలా ఉంటే మన టాలీవుడ్ విషయమే తీసుకుంటే….రకరకాల గాసిప్స్ తో రోజుకొక వార్త బయటకు వస్తూ ఉంటుంది….అదే క్రమంలో ఆ వార్తలో నిజం ఎంత ఉందో…అసలు నిజమో కాదో అన్న ఆలోచన కూడా ఉండదు సగటు ప్రేక్షకుడికి…ఇప్పుడు ఈ వార్త కూడా బహుశా ఆ కోవలోకే వస్తుంది…విషయంలోకి వెళితే….టాలీవుడ్ మాస్ మహా రాజా రవి తేజ….నందమూరి వారసుడు కల్యాణ్ రామ్….కలసి ‘కిక్-2’ సినిమా చేసిన విషయం తెలిసిందే….అదే క్రమంలో అప్పట్లో ఈ సినిమాకు సంబంధించి ఎన్నెన్ని రూమర్లు వినిపించాయి.
ఈ సినిమా ఔట్ పుట్ విషయంలో కళ్యాణ్ రామ్.. రవితేజల మధ్య విభేదాలు తలెత్తాయని.. సినిమా ఫ్లాప్ కావడంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగిందని.. అందుకే నాటి నుంచి వాళ్లిద్దరూ ఎక్కడా కలుసుకోలేదని చెప్పుకున్నారు ఇండస్ట్రీలో. అయితే నిన్నమాత్రం ఇద్దరు కలసి కనిపోంచడంతో ఆ పాత వార్తలు అన్నీ ఫేక్ ని తెలిపోయింది….రవితేజ కొత్త సినిమా ‘రాజా ది గ్రేట్’ ప్రారంభోత్సవానికి కళ్యాణ్ రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అతనే క్లాప్ కొట్టాడు. కళ్యాణ్-రవితేజ ఈ వేడుకలో చాలా సన్నిహితంగా మెలిగారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఒక్క దెబ్బతో కల్యాణ్ రామ్…తనకు రవి తేజకు మధ్య ఉన్న గొడవలు అంతా గాసిప్స్ అని ఇట్టే క్లియర్ చేశాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.