ఎన్టీఆర్ కి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్

  • June 7, 2018 / 06:40 AM IST

రెండు వారాల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 20వ తేదీన ఎన్టీయార్.. త‌న 35 జ‌న్మ‌దినోత్స‌వాన్ని జ‌రుపుకున్నారు. ఈ వేడుకను అభిమానులు వైభంగా చేసుకున్నారు. అయితే ఆ రోజు ఎన్టీఆర్ అన్న క‌ల్యాణ్‌ రామ్‌ తమ్ముడికి ఖరీదైన కానుక ఇచ్చినట్లు తెలిసింది. గత ఏడాది పుట్టిన రోజుకి ఐ ఫోన్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఈ సారి కోటి రూపాయల విలువైన రిస్ట్ వాచ్ ని కానుకగా ఇచ్చారు. దీనిని యూరప్ నుంచి తెప్పించినట్లు ఫిల్మ్ నగరవాసులు చెప్పారు. వాచ్ లంటే తెగ ఇష్టపడే ఎన్టీఆర్.. ఎన్టీఆర్ ఇచ్చిన కానుకను అపురూపంగా చూసుకుంటున్నట్లు సమాచారం.

క‌ల్యాణ్‌ రామ్ సినిమాలను నిర్మించి నష్టాల్లో ఉంటే ముందుగా పారితోషికం తీసుకోకుండానే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో జైల‌వ‌కుశ‌ సినిమా చేశారు. ఇది సూపర్ హిట్ సాధించింది. ఆ అభిమానంతోనే కోటి రూపాయలకు సైతం వెనకాడలేదని టాక్. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “అరవింద సమేత వీర రాఘవ” అనే సినిమాని చేస్తున్నారు. ఈ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో సాగుతోంది. కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే అతను నటించిన రొమాంటిక్ ఫిల్మ్ నా నువ్వే జూన్ 14 రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus