జై లవ కుశ కోసం ఖర్చుకి వెనుకాడని కళ్యాణ్ రామ్!

  • April 14, 2017 / 07:54 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27 వ సినిమా జై లవ కుశ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేగంగా జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ఢిల్లీ భామ రాశీ ఖన్నా, నివేత థామస్ హీరోయిన్ లుగా ఫిక్స్ అయ్యారు. ఇందులో తారక్ మూడు పాత్రల్లో విశ్వరూపం చూపించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ మూవీకి నిర్మాత కల్యాణ రామ్ భారీ బడ్జెట్ కేటాయించారు. 55 కోట్ల తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీయమని కళ్యాణ్ రామ్ బాబీకి చెప్పినట్లు తెలిసింది. మరో ఐదు కోట్లు పెరిగినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

కల్యాణ్ రామ్‌కు నిర్మాణంలో వచ్చిన  రవితేజ కిక్-2, ఇజం చిత్రాలు నష్టాల్ని మిగిల్చాయి. అయినా తమ్ముడికోసం ఇంత భారీ బడ్జెట్ కేటాయించడం తెలుసుకొని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ముగ్గురు హీరోయిన్లతో పాటు బాలీవుడ్ కెమెరా మెన్ సీ కే మురళీధరన్, హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ వంటి టెక్నీషియన్లను ఎంపికచేసుకొని ఇది భారీ బడ్జెట్ చిత్రమని చాటి చెప్పిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు నిర్మాణంలో ఎక్కడా రాజీ పడడంలేదు. ఇంత ఖర్చుపెట్టడం వెనుక బాబీ కథ, తమ్ముడి నటనపై ఉన్న నమ్మకమని అందరూ భావిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ మూవీపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus