ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ తో వస్తున్న కళ్యాణ్ రామ్!

  • December 18, 2018 / 07:59 AM IST

పాపం సరైన సబ్జెట్ దొరక్క.. దొరికిన సబ్జెక్ట్ ను సరిగా తీసే దర్శకుడు సెట్ అవ్వక ఇప్పటివరకూ హీరోగా నిలదొక్కుకొనే ప్రయత్నంలోనే ఉండిపోయిన కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు కమర్షియల్ సినిమా అనే చట్రం నుంచి బయటకి వచ్చి డిఫరెంట్ సినిమాలు చేయడం మొదలెట్టాడు. మరీ కొత్తగా లేకపోయినా “ఎం.ఎల్.ఏ” పర్వాలేదనిపించే సినిమానే. ఆ సినిమా తర్వాత కెమెరామెన్ టర్నడ్ డైరెక్టర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఒక సినిమా సైన్ చేశాడు. షాలిని పాండే, నివేదా థామస్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి “118” అనే టైటిల్ ను ఫిక్స్ చేయడంతోపాటు.. సినిమా టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం టీజర్ ఆకట్టుకోవడమే కాదు సినిమా చూడాలన్న ఆసక్తిని కూడా పెంచింది.

బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ వర్క్ కొత్తగా ఉండడంతోపాటు.. కళ్యాణ్ రామ్ స్లీక్ లుక్ కూడా బాగుండడం సినిమాకి ప్లస్ పాయింట్. “అర్జున్ రెడ్డి” అనంతరం షాలిని పాండే పూర్తిస్థాయి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. కాకపోతే.. టీజర్ లో ఎక్కడా నివేదా థామస్ కనిపించలేదు. జనవరిలో విడుదలకానున్న ఈ చిత్రం టీజర్ చూస్తుంటే.. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమనిపిస్తోంది.

                     

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus