కళ్యాణ్ రామ్ హీరో “ఇజం”

  • September 2, 2016 / 09:54 AM IST

ఎటువంటి నటులకైనా స్టార్ హోదా తెప్పించడం కమర్షియల్ డైరక్టర్ పూరీ జగన్నాధ్ కి మెగా ఫోన్ తో పెట్టిన విద్య. తన సినిమాలో హీరో పిరికి వాడిగా, బలహీనుడిగా కనిపించడు. పోకిరిగా, దేశముదురుగా, ఫుల్  టెంపర్ తో ఉంటారు. అందుకే ఆయన సినిమాలో నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రస్తుతం పూరి కళ్యాణ్ రామ్ లోని అసలైన హీరోయిజాన్ని చూపించే ప్రయత్నంలో ఉన్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి హీరో నటిస్తూ నిర్మిస్తున్న “ఇజం” సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. సెప్టెంబర్ 2 న హరికృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఇజం కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టేసాడు. గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ లను పూరి కొత్తగా చూపించారు. ఇజమ్ లోను ఆ ఫార్ములా ఉపయోగించారు. కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ గా కనిపించనున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని పోస్టర్ చూసిన నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 29 న రిలీజ్ చేయాలని చిత్ర బృందం శ్రమిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus