అఖిల్, విక్రమ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘హలో’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది కల్యాణి ప్రియదర్శన్. ఆ చిత్రానికి హిట్ టాక్ అయితే వచ్చింది కానీ.. పెద్దమొత్తంలో కొనుగోలు చేయడంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలూ వచ్చాయి. దీంతో ఆ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. మొదటి చిత్రం ఇలా డిజాస్టర్ కావడంతో ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కానీ మొన్నొచ్చిన ‘చిత్రలహరి’ చిత్రంతో డీసెంట్ హిట్ కావడంతో ఇప్పుడిప్పుడే ఈమెకి అవకాశాలు వస్తున్నాయి. ఈమె నటించిన తాజా చిత్రం ‘రణరంగం’ ఆగష్టు 15న (గురువారం) విడుదల కాబోతుంది.
ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా… కల్యాణి ప్రియదర్శన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమె మాట్లాడుతూ “హీరోయిన్ గా తెలుగులో మొదటి అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందం కలిగింది. ‘రణరంగం’లోను నాది మంచి పాత్రే. ఇక ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయాలని నాకు చాలా ఆశగా ఉంది. అయితే దానికి కొంత అనుభవం కావాలనే విషయం నాకు తెలుసనుకోండి. అలాగే డైరెక్టర్ కావాలనే కోరిక కూడా బలంగా వుంది. అందుకోసం ఇప్పటి నుండీ మంచి కథలు రెడీ చేసి పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ రెండు కోరికలు ఎప్పుడు నెరవేరుతాయా అని ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.