‘ఇండియన్ 2’ చిత్రానికి బ్రేక్ పడింది..!

Advertisement

శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన సెన్సేషన్ ‘ఇండియన్’ చిత్రానికి సీక్వెల్ గా ‘ఇండియన్ 2’ చిత్రాన్ని… గత నెలలో అంటే జనవరి 18 న లాంఛనంగా మొదలుపెట్టారు. ‘2.ఓ’ చిత్రం తరువాత మరో సీక్వెల్ కి శ్రీకారం చుట్టిన శంకర్‌… ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘ఇండియన్‌2’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు. కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఢిల్లీ గణేష్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్ర షూటింగ్ కి బ్రేక్ పడిందని తాజా సమాచారం.

ఇలా ఈ చిత్రానికి.. ఆది లోనే ఆటంకం కలగడానికి గల కారణమేంటి.. అనేది పరిశీలిస్తే.. కమల్‌హాసన్‌కు వృద్ధుడి గెటప్‌లో మేకప్‌ సరిగ్గా లేదన్న కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. 22 ఏళ్ళ క్రితం సంచలనం సృష్టించిన ‘ఇండియన్‌’ కి కొనసాగింపుగా ‘ఇండియన్ 2’ ని మొదలుపెట్టాడు శంకర్. రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చి కమల్‌హాసన్‌ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల చెన్నై, హైదరాబాద్‌, పొల్లాచ్చి లలో చిత్రీకరణకు ప్లాన్‌ చేశారు. కొద్దిరోజుల పాటు చిత్రీకరణ చురుకుగానే సాగిందట. ఇక తరువాత షెడ్యూల్‌కి సిద్ధమవుతున్న తరుణంలో రషెస్‌ చూసిన శంకర్‌కు కమల్‌హాసన్‌ మేకప్‌ నచ్చలేదని …. అందుకే షూటింగ్‌ నిలిపివేసి, హాలీవుడ్‌ మేకప్‌ నిపుణులతో సంప్రదించేందుకు అమెరికా వెళ్ళాలని.. శంకర్‌ నిర్ణయించుకున్నట్టు కోలీవుడ్‌ వి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news