వర్మ సినిమాకి మళ్ళీ అదే సీన్ రిపీట్..!

Advertisement

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్ మారబోతుందా.. ? అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్, పాటలతో పెద్ద రచ్చ చేసిన రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ పెద్ద షాక్ ఇచ్చిందని తెలుస్తుంది. ఈ నెల 26న లేదా ఆ తరువాత టైటిల్ మారబోతుందని చిత్ర యూనిట్ సభ్యుల నుండీ సమాచారం . ఇది వర్మ చిత్రాలకి కొత్తేమీ కాదు. గతంలో కూడా ‘బెజవాడ’ ‘వంగవీటి’ వంటి సినిమాలకి కూడా ఇదే సీన్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకే ఇంత రచ్చ జరుగుతుంటే.. మళ్ళీ ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తీయబోతున్నట్టు కూడా అనౌన్స్ చేసాడు వర్మ. ఈ చిత్రానికి ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే టైటిల్ ను కూడా పెట్టబోతున్నట్టు తన ట్విట్టర్లో ప్రకటించాడు. కులాల పేరుతో పెట్టే ఇలాంటి సినిమా పేర్లు పెట్టడం… ప్రజల మధ్య గొడవలు పెట్టే విధంగా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఏముంది.. మళ్ళీ తనకు కావాల్సిన పబ్లిసిటీ రాబట్టుకున్నాక.. సినిమా సెన్సార్ కు వెళ్ళేప్పుడు టైటిల్ మార్చక తప్పదులెండి.!

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news