శ్రీదేవి మరణిస్తే కంగనా కంగారు పడింది

అతిలోక సుందరి శ్రీదేవి మరణవార్తను ఇప్పటికీ అభిమానులెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వార్త వినగానే హీరోయిన్ కంగనా రనౌత్ కంటనీరు పెట్టుకున్నారు. గతంలో ఆమెను చూస్తూ నృత్యం నేర్చుకున్న కంగన ఈ వార్త తెలియగానే అనారోగ్యం పాలయ్యారు. కంగనా సన్నిహితులు మాట్లాడుతూ ‘శ్రీదేవి మరణవార్త తెలుసుకోగానే కంగన తీవ్రమైన జ్వరం బారిన పడ్డారని తెలిపారు.

శ్రీదేవిని అమితంగా అభిమానించే కంగన ప్రస్తుతం ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడలేదన్నారు. ప్రస్తుతం కంగన ‘మణికర్ణిక’ సినిమాలో నటిస్తున్నారు. ఆమె అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కాగా కంగన హీరో ప్రభాస్‌తో ‘ఏక్ నిరంజన్’లో నటించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus