క్రిష్ ‘మణికర్ణిక’ నుండీ తప్పు కోవడానికి అసలు కారణం అదే : కంగనా

కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా బాలీవుడ్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘మణికర్ణిక’. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని జనవరి 25 న విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని కొంత వరకు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసాడు. అయితే కంగనా – క్రిష్ కు విబేధాలు చేసుకోవడంతో.. ఈ ప్రాజెక్ట్ నుండీ క్రిష్ తప్పుకున్నట్టు గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది.

ఇటీవల ‘మణికర్ణిక’ తెలుగు ప్రమోషన్లలో భాగంగా.. కంగనా మాట్లాడుతూ.. “క్రిష్‌ కు ఓ తెలుగు చిత్రం ఒప్పుకోవడం వలన ‘మణికర్ణిక’ చిత్రం వాయిదా పడే పరిస్థితి వచ్చింది. మేం ఎలాగైనా జనవరిలోనే విడుదల చేయాలనుకున్నాం. దాంతో నిర్మాత కమల్‌ జైన్, రచయిత విజయేంద్రప్రసాద్‌గారు నన్నే డైరెక్షన్‌ చేయమని సూచించారు. అయితే ఇది ఈజీ మూవీ కాదు. ఒక చరిత్ర. అందుకే వేరే ఇద్దరు డైరెక్టర్లను పెట్టమని అడిగాను. అలా చేసినా సింక్‌ అవ్వలేదు. ఫైనల్లీ నేనే చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే అప్పటికే చాలా వరకు క్రిష్‌ పూర్త్తి చేయడంతో.. మిగిలినది నాకు కొంచెం సులువయ్యింది. ఒక పెద్ద ప్రాజెక్ట్‌ చేయాల్సిన పరిస్థితి రావడంతో క్రిష్ తప్పుకున్నారు. వాయిదా వేయడం ఇష్టం లేక మేం పూర్తి చేశాం. ఇక క్రిష్ తన ప్రాజెక్టులో తను బిజీగా ఉన్నాడు..” అంటూ వివరణ ఇచ్చింది కంగనా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus