‘మణికర్ణిక’ చిత్రీకరణలో కంగనాకు గాయం

  • July 20, 2017 / 10:23 AM IST

గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ చేస్తున్న మూవీ “మణికర్ణిక”. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్  ఘాన్సీ రాణి లక్ష్మీ భాయిగా నటిస్తోంది.  ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదారాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతోంది. నిన్న షూటింగ్ సయమంలో నిహర్‌ పాండేతో కత్తి సాము చేస్తుండగా ప్రమాదవశాత్తు అతని కత్తి కంగనా ముఖానికి తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. రెండు కనుబొమ్మల మధ్యలో కత్తి వేటు తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో చిత్ర బృందం ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు గాయానికి 15 కుట్లు వేశారు.

రెండు వారాల పాటు ఆమె విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. “ఎలాంటి డూప్స్ లేకుండా యుద్ధ సన్నివేశాలు చేసే సమయంలో పొరపాటున ఈ ప్రమాదం జరిగింది. కంగనా చాలా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొంది” అని నిర్మాత కమల్ జైన్ అన్నారు. ఘాన్సీ రాణి లక్ష్మీ భాయి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2018 లో విడుదల చేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus