కంగనా దెబ్బకి పారిపోయి వచ్చిన క్రిష్!

  • September 10, 2018 / 07:50 AM IST

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెలుగులో ఏక్ నిరంజన్ సినిమా మాత్రమే చేసింది. ఆ సమయంలో పూరి జగన్నాథ్ కి చుక్కలు చూపిందని అప్పట్లో టాక్. అయినా పూరి ఆ విషయాన్ని ఎక్కడా చెప్పుకోలేదు.   ప్రభాస్ తోను కంగనా గొడవపెట్టుకుంది. ప్రభాస్ తో నటించిన హీరోయిన్స్ అందరూ ఎంతో స్నేహంగా ఉంటారు. ఆమె తప్ప. అయితే టాలీవుడ్ స్టార్స్ తోనే ఇలా నడుచుకుంటుందా? అంటే కాదు అనే సమాధానం వస్తుంది. బాలీవుడ్ లోను గొడవలు పెట్టుకుంటోంది. గతంలో రచయిత అపూర్వ అస్రానీతో కంగనా గొడవ పెట్టుకుంది. అతడు రాసిన కథకు తానే రచయిత అని పేరు వేయించుకుని ఆ క్రెడిట్స్ ని కొట్టేసింది. దీనిపై ఇప్పటికీ అతడు గొడవ పడుతూనే ఉన్నాడు. ఇక హృతిక్ రోషన్- రాకేష్ రోషన్ లతో గొడవలు వేరే కథ. తాజాగా క్రిష్ తోను ఆమె గొడవపడినట్లు తెలిసింది. ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితాన్ని వెండితెరపై  చూపించే బాధ్యతను క్రిష్ కి కంగనా పిలిచి అప్పగించింది.

ఈ చిత్రానికి  “మణికర్ణిక – ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ” అనే టైటిల్ ఖరారు చేసి చాలా వరకు షూటింగ్ ని క్రిష్ పూర్తి చేశారు. జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్లో సంజయ్ కుట్రీ, నిషాద్ పిట్టి హిందీలో నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి కొన్ని రోజుల క్రితం క్రిష్ బయటికి వచ్చారు. కానీ అందుకు గల కారణాలు వెల్లడించలేదు. అతను బయటికి రావడానికి కంగనా ఓవర్ యాక్షన్ కారణం అని ఉత్తరాది మీడియా కథనాలను ప్రచురిస్తున్నాయి. అంతేకాదు క్రిష్ తెర‌కెక్కించిన 43 రోజుల విజువ‌ల్స్‌ని క‌ట్ చేయించి వాట‌న్నిటినీ తిరిగి రీషూట్ చేస్తోందిట‌. కంగ‌న ఇంత మొండిగా ఎందుకిలా చేస్తోంది? అస‌లు క్రిష్‌తో త‌లెత్తిన వివాదం ఏ స్థాయిలోనిది? అంటూ చ‌ర్చ సాగుతోంది. మ‌రోవైపు త‌న‌పై చిత్రీక‌రించిన మ‌ల్ల యుద్ధ స‌న్నివేశాల్ని తొల‌గించిందంటూ మ‌ణిక‌ర్ణిక ప్రాజెక్టు నుంచి సోనూ సూద్ త‌ప్పుకున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. కంగనా చేస్తున్న పనుల వల్ల 2019 జనవరి 25న మణికర్ణిక రిలీజ్ అవుతుందా? అని నిర్మాతలు తలపట్టుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus